కాంట్ రచనలు/ KANT RACHANALU

వాడ్రేవు చినవీరభద్రుడు / Vadrevu Chinaveerabhadrudu · Books

కాంట్ రచనలు/ KANT RACHANALU book cover

Price: Rs. 70. ఆధునిక పాశ్చాత్య తత్త్వ శాస్త్ర చరిత్రలో ఇమాన్యుయల్ కాంట్ (1724-1804) అత్యున్నత శ్రేణి తాత్త్వికుడిగా కొనియాడ బడుతున్నాడు. ఆయన ప్రపంచానికి వదిలిపెట్టి వెళ్ళిన తాత్త్విక ఆలోచనాప్రభావానికి గత రెండువందల ఏళ్ళుగా లోనుగాని ఆలోచనాపరుడుగాని, తాత్త్వికుడుగాని ఎవరూ లేరనడం అతి శయోక్తి కానేరదనాలి. హెగెల్, షోపెన్ హోవర్, మార్మ్, కిర్క్ గార్డ్, నీషే వంటి పందొమ్మిదో శతాబ్ది తాత్త్వికులతో పాటు, హిడెగ్గర్మెదలుగా డెరిడా వరకూ ఇరవయ్యో శతాబ్ది తాత్త్వికులు కూడా తమ ఆలోచనా స్పష్టతకు కాంట్ కి ఎంతో ఋణపడి ఉంటారు. కాంట్కి పూర్వం పాశ్చాత్య తత్త్వశాస్త్ర చరిత్రలో జ్ఞానం ఇంద్రియగ్రాహ్యమని కొందరూ, కాదు బుద్ధిగ్రాహ్యమని కొందరూ వాదించుకునే పరిస్థితి ఉండేది. ఒక్కొక్క యుగంలో హేతువాదానికి ప్రాబల్యం ఉంటే, ఒక్కొక్క కాలంలో అనుభవప్రామాణ్యానికి బలం ఉండేది. చివరికి ఇది దేశాల్ని కూడా వదిలిపెట్టలేదు. బ్రిటిష్ తత్త్వవేత్తలు అనుభవప్రామాణ్యాన్ని బలపరిస్తే, ఫ్రెంచి తత్త్వవేత్తలు తార్కిక ప్రామాణ్యతను పైకెత్తేవారు. ఇటువంటి పాక్షిక చింతనవల్ల సత్యమీమాంస నేల విడిచిన సాముగా మారిపోతున్న రోజుల్లో హేతువునీ, ఇంద్రియజ్ఞానాన్నీ అద్భుతంగా సమన్వయించి సత్యమీమాంసను సమగ్రపరిచిన మహోన్నత మేధావి కాంట్. న్యూటనీయ నూత్రాలు ఆవిష్కరించిన ప్రాకృతిక నియతిముందు మానవస్వాతంత్య్రం వీగిపోయే పరిస్థితి ఏర్పడిన ప్రమాదంనుంచి తిరిగి మానవ సంకల్పానికీ, స్వాతంత్య్రానికి బలమిచ్చినవాడు కాంట్. ఆయన జీవితకాలపు కృషినుంచి కొన్ని మేలిమి రచనల్ని తెలుగులో మొదటిసారిగా మీ ముందుకు పీకాక్ క్లాసిక్స్ తీసుకువస్తున్నది. కాంట్ ఆలోచనావరిణామం మీద సమకాలీన కాంట్ పండితుల్లో ప్రముఖుడు, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం కోసం కాంట్ మీద ఒక సంకలనాన్ని తీసుకువచ్చిన పాల్ గుయెర్ రాసిన వ్యాసం ఈ సంకలనానికి అదనపు ఆకర్షణ. నేడు గ్లోబల్ మార్కెట్ శక్తులు కొత్తరకం నిర్ణాయకవాదాన్ని ప్రవచిస్తున్న వేళ మానవ స్వాతంత్య్రానికి పెద్దపీట వెయ్యాలనుకునే వాళ్ళందరూ చదవవలసిన సంకలనం ఇది.

Browse more Telugu books