కవితాదీప్తి / KAVITHAADEEPTHI

Gudipati / గుడిపాటి · Literature

కవితాదీప్తి / KAVITHAADEEPTHI book cover

Price: Rs. 180. ప్రభువులను స్తుతించే స్తోత్రపాఠాలకు అక్షరాల్ని తాకట్టు పెట్టేవాడు కవికాదు. తను రచించిన కావ్యాన్ని రాజులకు అంకితమివ్వ నిరాకరించడంలోనే మహా కవి పోతన ధిక్కార స్వభావం ఇమిడి ఉంది. పోతన సమకాలంలో ఎందరో కవులున్నారు. కానీ ఇవాళ పోతన మాత్రమే గుర్తుండిపోవడానికి ఆయన చూపిన తిరుగుబాటు తత్వమే కారణం. పాలకుల మండువాల్లో తిరుగాడుతూ వారి తాయిలాల కోసం ఆశపడే కవులు చరిత్రపుటల్లో మిగలరు. ప్రజల పక్షాన నిలబడి, వారి బాధల పల్లవిని వినిపించిన కవులు మాత్రమే కాలం గడుస్తున్నా నిలిచి వెలుగుతారు. ఒక కవిత చదవగానే కొత్త పరవశమేదో కమ్ముకోవాలి. చదివిన కొద్దీ చదవాలనిపించాలి. అలాంటి కవిత్వం రాయడం అంత సులువు కాదు. సంఘటనల మీద, వార్తాకథనాల మీద వ్యాఖ్యానాలు చేయడం కవిత్వం కాదు. ఒక ఘటన మనసున రగలాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా కలవరపరచాలి. ఉండబట్టలేనితనంతో కవిత్వమై వెలువడాలి. సున్నితత్వాన్ని, లేలేత కలల సోయగాన్ని కాలం కత్తిగాట్లకు కోల్పోకుండా ఉన్నవారే ఇలాంటి కవిత్వం రాయగలరు.

Browse more Telugu books