కళాపూర్ణోదయము / Kalaapurnodayamu

Dr. Pedapati Nageswararao / డా.పెడపాటి నాగేశ్వరరావు. · Literature

కళాపూర్ణోదయము / Kalaapurnodayamu book cover

Price: Rs. 45. కళాపూర్ణోదయములోని ప్రతి పాత్రలోను ఒక్కొక్క సాధన కనిపించును. అందు ముఖ్యముగా చూపబడినది యోగసాధన. దానిని పింగళి సూరన గారు వివిధ రీతులలో కథలో పొదిగి చూపినారు. దీనిని శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి గారు మొదలగు వ్యాఖ్యాతలు ప్రత్యేకముగా పరామర్శింపలేదు. డా॥జి.వి. కృష్ణారావు గారు విశిష్టాద్వైతమే కళాపూర్ణోదయమునకు ముఖ్య సూత్రమని తమ సిద్ధాంత వ్యాసములో నిరూపించినారు. ఇప్పుడు కళాపూర్ణోదయము కథలోని ముఖ్య సంఘటనలపై ప్రదర్శితమైన యోగమును గూర్చి పరిశీలింతము, అసలు విశిష్టాద్వైతములో యోగము యొక్క పరిస్థితిని గూర్చి శ్రీ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి వాక్యములు చూడుడు. “అద్వైతమందనేక భేదములు గలవు. కాని మన దేశమందు ముఖ్యమైనవి మూడు. శ్రీ వైష్ణవము, వీరశైవము, శాంకరము.

Browse more Telugu books