కలలు చెప్పే కథలు / Kalalu Cheppe Kathalu
వి.శ్రీనివాస చక్రవర్తి / V. Srinivasa Chakravarthi. · Books

Price: Rs. 112. మన మనసుని సచేతన మనసు (conscious mind),అచేతనమనసు (unconscious mind) అని రెండుగా విభజించవచ్చు. ఇంద్రియాల ద్వారా, ఆలోచన ద్వారా, మన సచేతన గ్రహిస్తుంది. కాని సచేతన మనస్సుకి 'అడుగున' లేక 'వెనుక' గుప్తంగా ఉన్న మనో విభాగమే అచేతన మనస్సు. దాన్ని మనం ప్రత్యక్షంగా అనుభవించలేం. కాని దాని రహస్య ప్రభావాన్ని మాత్రం మన సచేతన నిరంతరం అనుభవిస్తుంది. అచేతనకి భాష రాదు. అయినా అది మన సచేతనతో సంభాషిస్తుంది, ఎలా? మనకది సంజ్ఞలు చేస్తుంది అంటాడు కార్ల్ యుంగ్. అందుకది కొన్ని ప్రతీకల్ని వాడుకొంటుంది అంటాడాయన. అచేతన వాడే ఈ 'పరిభాష' ని అర్థం చేసుకొమ్మంటాడు. సచేతన, అచేతనల మధ్య సంబంధాన్ని గ్రహించమంటాడు. యుంగ్, తద్వారా జీవితాన్ని మరింత సమర్థంగా జీవించమంటాడు ఆయన. ఈ ఆసక్తికరమైన కథనాన్ని ఆస్వాదించండి. అనుభవించండి.