కథ 2024 / KATHA 2024

Editor · Books

కథ 2024 / KATHA 2024 book cover

Price: Rs. 157. ప్రతి మనిషి జీవితానికీ ఒక ఆశయం ఉన్నట్టే, ప్రతి సంస్థకు ఆశయం, అందుకు తగిన ఆచరణ ఉంటాయి. ఆచరణకు అనుగుణంగానే ప్రయాణం సాగుతుంది. కథాసాహితి కూడా అంతే. కథ 1990 నుండి కథ 2024... ముప్పై అయిదు సంవత్సరాల నడక. 209 మంది రచయితలు, 487 కథలు... ఇది మా ట్రాక్ రికార్డు అని చెప్పడానికికాదు ఈ లెక్కలు. కేవలం మా సంతృప్తిని ప్రకటించడానికే. కథ 1990 కోసం ప్రయత్నాలు మొదలైనప్పుడు ఇన్నేళ్లు నడపగలమనే నమ్మకం మాకూ లేదు, సాహితీలోకానికీ లేదు. కానీ ఇప్పుడలా కాదు, ఇది చిరకాలం సాగుతుందని నమ్మిక. సాధ్యమో కాదో తెలియదు కానీ ఇది మా కల, కోరిక, అందుకు సంకేతంగా ఈ సంకలనం ముఖచిత్రంలో Infinity (అనంతం) గుర్తు 35 అంకెలో భాగమయింది. ప్రతి దారిలో మైలురాళ్లు ఉంటాయి కదా! ఒక్కొక్క మైలురాయి దాటినప్పుడు గమ్యానికి చేరువవుతున్నామని ఆనందం కలుగుతుంది. కానీ మా గమ్యం అనంతమైనప్పుడు ప్రతి మైలురాయి మా బాధ్యతను గుర్తుచేస్తుంది. ఎందుకంటే, ఇది అంత సాఫీగా జరుగుతున్న యాత్ర కాదు. ఇక్కడ వచ్చే ఇబ్బందులను, అడ్డంకులను, ఒత్తిడులను దాటి ముందుకు సాగగలమనే విశ్వాసం, సాహితీ ప్రియుల అభిమానం మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయి.

Browse more Telugu books