కథా ప్రపంచం -2023 / Katha Prapancham -2023

Malishetti Sitaram / మలిశెట్టి సీతారాం · Books

కథా ప్రపంచం -2023 / Katha Prapancham -2023 book cover

Price: Rs. 95. మనం ఒంట్లోంచీ ఇంట్లోకీ ఊళ్ళోకీ ప్రపంచంలోకీ చాలా వేగంగా విస్తరిస్తూ విశ్వనరుడిగా తయారైపోపోతున్నామనే భ్రమలు కల్పిస్తూనే ఒంటరితనంలోకి కూరేయడమే ప్రపంచీకరణ ప్రధాన లక్ష్యం. అది ఎన్ని విధాలుగా నెరవేరుతూ జనానీకాన్ని ఎన్ని రకాలుగా పతనావస్థకు చేరుస్తోందో చెప్పే కథలు ఉన్నాయి. ఉండేవాడికి ఎక్కువై సమస్య - లేనివాడికి తక్కువై సమస్య. ఉండీలేని అమాయకుల అమాయకత్వమే సమస్యగామారిన వైనాన్ని చర్చించే కథలుకూడా ఉన్నాయి. సమాజ గమనంలో పాత సమస్యలకి కొత్త పరిష్కారాలతోబాటు ఆ పరిష్కారాల్లోంచి పుట్టే సరికొత్త సమస్యలూ ముందుకు తోసుకొచ్చేస్తూ ఉంటాయి. అలా ఒకే సమస్యని నాలుగుకోణాల్లోంచీ చూపించి నలభై విధాలుగా ఆలోచింపజేసే కథలు ఇందులో ఉన్నాయి. ఇలా సమాజంలోని అన్ని పార్శ్వాలనీ తడిమే కథల సమాహారమే ఈ కథా ప్రపంచం. ఇందులోని కథలన్నీ విభిన్నమైనవి విలక్షణమైనవి. ఆలోచింపజేసేవి.

Browse more Telugu books