ఓబీసీలకు అంబేడ్కర్ కాంట్రిబ్యూషన్ / OBClaku Ambedkar Contribution

బి.ఎస్. రాములు · New Arrivals

ఓబీసీలకు అంబేడ్కర్ కాంట్రిబ్యూషన్ / OBClaku Ambedkar Contribution book cover

Price: Rs. 55. ఈ దేశ భూమి పుత్రులు THE MASTERS OF COUNTRY "షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్కు, వెనుకబడిన తరగతులు (Backward Classes), షెడ్యూల్డ్ తెగలతో కలిసి (Scheduled Tribes) సహకారంతో పని చేయాలని ఆశ ఉంది. ఎందుకంటే వారు కూడా షెడ్యూల్డ్ కులాల మాదిరిగానే దాదాపు అదే స్థితిలో ఉన్నారు. దురదృష్టవశాత్తు, ఈ వర్గాలు రాజకీయ చైతన్యం అనే విషయంలో, షెడ్యూల్డ్ కులాల అంతటి స్థాయిని ఇంకా అభివృద్ధి చేసుకోలేదు. గత ఇరవై సంవత్సరాలుగా షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన రాజకీయ, సామాజిక కార్యకలాపాల ఫలితంగానే షెడ్యూల్డ్ కులాలు ఆ చైతన్యాన్ని పొందగలిగారు. స్వతంత్ర భారత రాజ్యాంగం వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలను దేశంలోని నిజమైన 'దేశాధిపతులు'గా చేసింది. ఇంతవరకు, కులవాద హిందువులలోని ఒక చిన్న విభాగం దేశ పాలకులుగా వ్యవహరించారు. షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్కు ఉన్న భయం ఏమిటంటే వెనుకబడిన వర్గాలు, షెడ్యూల్డ్ తెగలు చైతన్య లోపం వల్ల ఆ చిన్న విభాగపు కుల హిందువుల బారిన పడి, తమ స్వంత ఆధిపత్యాన్ని సంపాదించుకోవడానికి బదులుగా మళ్లీ వారి బానిసలుగానే మిగిలిపోవచ్చు. ఈ వర్గాలు తమ కాళ్లపై నిలబడేందుకు సహాయం చేయడం షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ యొక్క మొదటి కర్తవ్యం. వారు కోరితే, ఈ రెండు వర్గాలను ఒకే సాధారణ సంస్థలో చేర్చే విధంగా, షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ తన పేరును మార్చి 'బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్'గా పిలుచుకునేందుకు కూడా సిద్ధంగా ఉంది. ఇది సాధ్యం కాకపోతే, అలాంటి సంస్థలతో పనిచేయడానికి అనుకూలమైన కూటమిని ఏర్పరచేందుకు షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్ సిద్ధంగా ఉంటుంది."

Browse more Telugu books