ఒడిసీ / ODYSSEY

BinaDevi / బినాదేవి · Stories & Poetry

ఒడిసీ / ODYSSEY book cover

Price: Rs. 180. ఇలియడ్, ఒడిసీ అనేవి రెండూ గ్రీకు పురాణాలు. ఒడిసీ కథానాయకుడు ఒడిసియస్. ట్రాయ్ యుద్ధం పదేళ్ల పాటు జరిగింది. యుద్ధం అయిపోయాక అతడు ఇంటికి తిరిగి రావడానికి మళ్లీ పదేళ్లు పట్టింది. మధ్యలో ఎన్నో అవాంతరాలు. ఎన్నో ప్రమాదాలు. అందుకే ఒడిసీ అనే పదం కష్టాలతో కూడిన సుదీర్ఘ ప్రయాణానికి ఒక సంకేతంగా మారిపోయింది. 'ఒడిసీ'ని బీనాదేవిగారు తనదైన శైలిలో ఆడుతూ పాడుతూ చెప్పారు. ఒక పక్క హోమర్ ని పలకరిస్తూ మరో పక్క పాఠకుడికి కబుర్లు చెబుతూ మధ్య మధ్య చెణుకులు విసురుతూ కథ చెప్పారు. మూలకథ గ్రీకుదైనా కధనం తెలుగు నుడికారంతో సాగుతుంది. పూర్తిగా ఆధునికంగా తేట తెలుగులో అక్కడక్కడా ఇంగ్లీషు పదాలతో అలవోకగా సాగిపోతుంది.

Browse more Telugu books