ఒక రోజు బాంగ్లా కథలు / Oka Roju Bangla Kathalu
కాత్యాయని /Kathyayani · Books

Price: Rs. 180. మానవ జీవితంలోని సంక్లిష్టతలను, మనసతత్వాల్లోని వైవిధ్యాన్ని సున్నితమైన రీతిలో చిత్రించటం బిభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ్ రచనల్లోని ప్రత్యేకత. ఆయన రాసిన విస్తృతమైన కథా సాహిత్యంలోంచి ఎన్నిక చేసిన పన్నెండు కథల సంపుటి ఇది. కుటుంబాల్లో, సమాజంలో నిస్సహాయులైన మనుషుల వేదనకు సహానుభూతిని ప్రకటిస్తూ పాఠకులలో సున్నితమైన స్పందనలను రేకెత్తించే కథలు ఇవి. "బంద్యోపాధ్యాయ్ రచనల్లోని వాస్తవికత కేవలం యథాతథంగా నమోదయినది కాదు, అదొక కవిత్వం వంటిది....అతి సాధారణమైన అంశాలకు ఆయన శాశ్వతత్వాన్ని కల్పిసాడు." - శిశిర్ కుమార్ దాస్, సాహిత్య చరిత్రకారుడు. "నేను బిభూతిభూషణ్ సాహిత్యాన్ని చదువుతూ పెరిగినవాడిని. ఆయన రచనల్లోని ప్రాంతీయతా, చిత్రణ, అక్కడి మట్టి, చెరువు, వెదురు పొదనా దృశ్య మాధ్యమానికి వ్యాకరణాన్ని సమకూర్చాయి." - మృణాల్ సేన్, ప్రముఖ బెంగాలీ సినిమా దర్శకుడు.