ఒకానొక భ్రమ భవిష్యత్తు / OKANOKA BRAMA BHAVISHATU
ఆనందేశి నాగరాజు/ Anandesi Nagaraju · Caste, Religion & Culture

Price: Rs. 55. మానవజాతి ఆలోచనా విధానంలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన శాస్త్రవేత్తలు ముగ్గురు. కోపర్నికస్, చార్లెస్ డార్విన్, సిగ్మండ్ ఫ్రాయిడ్. భూకేంద్రక విశ్వ విశ్వాసాన్ని (Earth centric universed) నికోలస్ కోపర్నికస్ తప్పని రుజువు చేశాడు. కోపర్నికస్ కంటే ముందు భూమి చుట్టు సూర్యచంద్రులు, ఇతర గ్రహాలు, నక్షత్రాలు తిరుగుతుంటాయని నమ్మేవారు. మనిషి కోసమే విశ్వం సృష్టించబడిందని భావించడం వల్ల మానవ నివాసమైన భూమే విశ్వకేంద్రంగా విశ్వసించేవారు. మానవ కేంద్రక జీవసృష్టి (Anthropcentrism) తప్పని జీవపరిణామ సిద్ధాంతం ద్వారా చార్లెస్ డార్విన్ రుజువు చేశాడు. డార్విన్కు పూర్వం అన్ని మతాల ప్రజలు భూమి మీద మొట్టమొదటగా మనిషిని దేవుడు తన రూపంలో సృష్టించాడనీ, అతనికి తోడుగా ఇతర వృక్ష, పక్షి, జంతుజాలాలను సృష్టించాడని నమ్మేవారు, కానీ ప్రకృతిలో జీవం యాధృచ్ఛికంగా ఏర్పడి లక్షల సంవత్సరాలలో ఏకకణజీవి నుండి క్రమంగా పరిణామం చెందుతూ అనేక రకాల వృక్ష, పక్షి, జంతు జాతులుగా పరిణామం చెందాయనీ, మనిషి కూడా ఇతర స్తన్యజాతి (Mammals) జీవుల నుండి పరిణామక్రమంలో ఏర్పడిన జాతేనని శాస్త్రీయంగా రుజువు చేశాడు.