ఎవరిదీ ప్రజాస్వామ్యం? ఏ విలువలకీ ప్రస్థానం? / EVARIDEE PRAJASWAAMYAM? EE VILUVALAKEE PRASATHAANAM?

NIKHILESWAR / నిఖిలేశ్వర్ · Politics

ఎవరిదీ ప్రజాస్వామ్యం? ఏ విలువలకీ ప్రస్థానం? / EVARIDEE PRAJASWAAMYAM? EE VILUVALAKEE PRASATHAANAM? book cover

Price: Rs. 95. జీవిత విధానంగా రూపొందించవలసిన 'ప్రజాస్వామ్యం', ఇప్పుడు భారతదేశంలో 'దిక్కులేకుండా' పోయింది! మన ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి రక్షణ కల్పించవలసిన ఈ 'ప్రజాతంత్రం' దారి తప్పింది! ప్రజాస్వామిక జీవిత విధానాన్ని కులతత్వం, మతఛాందసం, అక్రమార్జన, అవినీతి చీడపురుగుల్లా తొలచి వేస్తున్నాయి. మానవ విలువల్ని పరిరక్షించుకోవలసిన బాధ్యత ప్రజా ఉద్యమాలది. ఈ దిశలోనే ప్రజాస్వామిక హక్కులు, ఉద్యమాలు, మతం, కమ్యూనిజం తదితర అంశాలను విశ్లేషిస్తూ విమర్శనాత్మక దృష్టినిచ్చే ఈ వ్యాసాలు కవి, విమర్శకుడు, కథా రచయిత, అనువాదకుడు నిఖిలేశ్వర్ గత 25 సం.లలో రచించిన వాటిలోంచి ఏరిన రచనలు. ప్రజాస్వామిక విలువల పరిరక్షణ కోసం నిఖిలేశ్వర్ సంధిస్తున్న ప్రశ్నలే-

Browse more Telugu books