ఊరికి పోదాం భూదేవీ! / Let's go to town, Earth Goddess
గీతాంజలి / GITA ANJALI · Stories & Poetry

Price: Rs. 180. గీతాంజలి ఈ కథా సంకలనంలో 1995-2002 మధ్య కాలంలో రాసిన కథలు ఉన్నాయి. ఈ సంకలనంలో గీతాంజలి స్త్రీవాద.. దళితవాద.. ముస్లీం మైనార్టీ వాదంలాంటి భిన్న అస్థిత్వాలకు సంబంధించిన వస్తువులతో పాటు అభివృద్ధి పేరుతో పాలకవర్గాలు అమలు చేస్తున్న సామ్రాజ్యవాద అనుకూల నూతన ఆర్థిక విధానాల వలన తీవ్రంగా నష్టపోతున్న మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజలు, విద్యార్థులు, ఇతర కులవృత్తుల శ్రామికులు, స్త్రీలు ముఖ్యంగా గ్రామాల్లో దళిత స్త్రీల సమస్యలతో పాటు రైతులు వ్యవసాయ సంక్షోభంలో పడి వలసలు, ఆత్మహత్యలు చేసుకునే దిశగా నెట్టివేయబడుతున్నారో, భూమి నుంచి ఎలా పరాయికరణకు గురవుతున్నారో అత్యంత ప్రతిభావంతంగా సంటిది, యాడి, ఊరికిపోదాం భూదేవి, కథా-2020, బిచ్చగాడు, చీకట్లోంచి... చీకట్లోకి కథల్లో చిత్రించింది. ముస్లిం కమ్యూనిటీలో స్త్రీల చుట్టూ అల్లుకున్న తమసొంత మతం వల్ల వచ్చిన సమస్యలను అణిచివేయబడుతున్న వారి పునరుత్పత్తి హక్కులను "బచ్చేదాని" కథలో అనితరసాధ్యంగా రాసింది. అలాగే "బిఛ్చమన్" కథలో ముస్లిం కమ్యూనిటీ మెజారిటీ హిందూ కమ్యూనిటీ ద్వారా ఎదురుకుంటున్న మతహింసను గుజరాత్ జీనోసైడ్ నేపథ్యంలో చిత్రించింది. మిగతా కథల్లో ఆధిపత్య బ్రాహ్మణీయ ఫ్యూడల్ వ్యవస్థలో.. పితృస్వామ్య భావజాలం అన్నివర్గాల, కులాల, మతాల స్త్రీల జీవితాలను ఎటువంటి సంక్షోభంలోకి నెట్టివేస్తున్నాయో రాయడంతో పాటు.. ఆ అణిచివేతను స్త్రీలందరూ తమతమ చైతన్యస్థాయికి తగినట్లు ఘర్షణపడుతూనే ఎలా ఎదుక్కొంటారో వాస్తవికంగా.. కొన్నిసార్లు ప్రతీకాత్మకంగా చెప్పే ప్రయత్నం చేసింది. అణిచేస్తే ఆణిగి పోవడం కాదు ఎదురెగిరి పోరాడాలని చెప్తాయి ఈ కథల్లోని పాత్రలు, సమస్యను పునాది-ఉపరితల అంశాలుగా విశ్లేషిస్తూ మూలాల్ని చర్చలోకి తేవడం గీతాంజలిని ఇతర రచయిత్రులకంటే భిన్నంగా నిలబెడుతుంది. మొత్తానికి మొత్తంగా గీతాంజలి కథలనిండా స్త్రీవాద కోణంలో సామాజిక నిమ్నోన్నత అదనపు సువాసన - స్త్రీవాద కథా సాహిత్యాలలో గీతాంజలి విలక్షణశైలి, గంభీర వ్యక్తిత్వం. స్త్రీ చుట్టూ అల్లుకున్న ఉచ్చునే కాకుండా మూలాల్ని వెతికే రచయితగా ప