ఇనుప కచ్చడాలు/ Inupa Kachadalu
తాపీధర్మారావు /Tapidharma Rao · Books

Price: Rs. 45. తాపీధర్మారావు గురించి వేగుచుక్క గ్రంథమాల సంస్థను స్థావించారు. ఇంటింటి విజ్ఞానమాల స్థావకులలో ముఖ్యులు. "కొండెగాడు", "జనవాణి" పత్రికలకు పత్రికాధిపతిగా, సంపాదకులుగా వున్నారు. 1940 లో "కాగడా" పత్రికను వెలువరించారు. ఆంధ్ర భాషాభివృద్ధికి వీరు చేసిన కృషిని గుర్తించి శ్రీ శృంగేరి పీఠాధిపతులు "ఆంధ్ర విశారద" బిరుదునిచ్చి గౌరవించారు. దాదాపు మూడు దశాబ్దాలుగా గ్రాంథిక భాషా వాదిగా గణుతికెక్కినా, గిడుగు రామమూర్తిగారి వ్యావహారిక భాషావాదాన్ని రాష్ట్రమంతటా ప్రచారం చేసి గుర్తింపు కలిగించారు. దిన పత్రికలలోనూ, వార పత్రికలలోనూ తొలిసారిగా వ్యావహారిక భాషను ప్రవేశపెట్టిన గౌరవం శ్రీ తాపీ ధర్మారావు గారే దక్కించుకున్నారు. ఆనాడు వారు వేసిన పునాదుల మీదనే నేటి పత్రికా రచన ఎంతో ఎత్తున నిలిచివుంది. వీరి - దేవాలయాల మీద బూతుబొమ్మలెందుకు?, పెళ్ళి దాని పుట్టుపూర్వోత్తరాలు- మూఢనమ్మకాల్ని పటాపంచలు చేసి గొప్ప సంచలనం రేకెత్తించిన గ్రంథాలు. వీరి పాతపాళి, కొత్తపాళి, ఆలిండియా అడుక్కుతినేవాళ్ల మహాసభ, సాహిత్య మొర్మరాలు, రాలూ రప్పలూ, ఇనుపకచ్చడాలు, విజయ విలాసము హృదయోల్లాస వ్యాఖ్య తెలుగు పాఠకులకు చిరపరిచితాలే.