ఇండియా లో కులాలు / India Lo Kulalu

గాంధీ / GANDHI · Caste, Religion & Culture

ఇండియా లో కులాలు / India Lo Kulalu book cover

Price: Rs. 25. మనలో చాలా మంది మానవ నాగరికతా నిర్మాణానికి అవసరమైన భౌతిక వస్తువుల స్థానిక, జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలను చూసే ఉంటారు. కాని కొద్దిమంది మాత్రమే, మానవ వ్యవస్థల (human institutions) ప్రదర్శనను ఊహించగలరు. అది ఓ వింత భావం. కొందరు దాన్ని అత్యంత వెర్రి భావం అనవచ్చు. అయితే, జాతుల గురించి అధ్యయనం చేస్తున్న విద్యార్ధులుగా మీరు ఈ ఆవిష్కరణను తిరస్కరించరని ఆశిస్తాను. కనీసం మీకిది ఓ వింత వ్యవహారం అయితే కారాదు. పాంపై (Pompeii) శిధిలాల వంటి ఏదో ఒక చారిత్రిక ప్రదేశాన్ని మీరంతా చూసేవుంటారని నమ్ముతున్నాను. అక్కడ మీరు ఆ శిధిలాల చరిత్రను ఆశువుగా చెబుతున్న గైడు మాటలను ఎంతో కుతూహలంగా విని ఉంటారు. నా ఉద్దేశంలో జాతుల అధ్యయనం చేసే (Ethnology) విద్యార్థి ఓ రకంగా, ఆ గైడు లాంటివాడే. కాకుంటే, బహుశా, ఈ విద్యార్ధి మరింత సీరియస్, నేర్చుకోవాలనే కోరికతో, ఆనాటి సామాజిక వ్యవస్థలను సాధ్యమైనంత వస్తుగతంగా గమనిస్తాడు; వాటి మూలాలనూ పనితీరునీ పరిశీలిస్తాడు. ఆదిమ సమాజాలనూ వాటికి ప్రతిగా ఆధునిక సమాజాలనూ పరిశీలించే సెమినార్ ఇది. దీనిలో నా తోటి విద్యార్థుల్లో అత్యధికులు ఇప్పటికే తమకు ఆసక్తివున్న ఆధునిక లేదా ఆదిమ వ్యవస్థలను ప్రతిభావంతంగా ప్రదర్శించి బయటపడ్డారు. ఇప్పుడు, ఈ సాయంత్రం నా వంతు వచ్చింది. 'ఇండియాలో కులాలు: వాటి పని తీరు, పుట్టుక, అభివృద్ధి" అనే విషయంతో మిమ్మల్ని నా శాయశక్తులా అలరించడానికి ప్రయత్నిస్తాను.

Browse more Telugu books