ఇండియాలో ఫెడరలిజం / INDIA LO FEDERALISM
B.S. Ramulu / బి.ఎస్. రాములు · Politics

Price: Rs. 144. 1.1. ఫెడరలిజం పరిధి, పరిమితి ఫెడరలిజం అనేది కేంద్రం, రాష్ట్ర సంబంధాలు, స్థానిక సంస్థల అధికార వికేంద్రీ కరణకు సంబంధించింది మాత్రమే కాదు. వ్యక్తికి కుటుంబానికి, భార్యకు భర్తకు, కుటుంబంలో పిల్లలకు, పెద్దలకు, సామాజిక వర్గాల్లో మతాల వారీగా, కులాల వారీగా, సంస్కృతి వారీగా, ప్రాంతాల వారీగా, వయస్సుల వారీగా, దశల వారీగా, హెూదాల వారీగా గల సంబంధాల పరిధులను, పరిమితులను నిర్వచించేది, నిర్వహించేది, నిర్మించేది, నిర్మాణ స్వరూపా లను, స్వభావాలను మార్చడానికి కృషి చేసేది ఫెడరలిజం. 1.2. మానవ సంబంధాలు ఫెడరలిజం మానవ సంబంధాలు ఎన్ని రకాలో ఫెడరలిజం- సెంట్రలిజం, సహకార విధానం అన్ని రకాలు. వ్యక్తి స్వేచ్ఛ, పౌర హక్కులు, ప్రజాస్వామిక హక్కులు, పిల్లల హక్కులు, వృద్ధుల హక్కులు, మహిళల హక్కులు, మత స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, ఆస్తిహక్కు స్వేచ్ఛ మొదలైనవి కేంద్రీకృత రాజ్యానికి, రాజ్యాంగానికి, వాటి పరిమితులకు, పరిధులకు లోబడి కొనసాగే ఫెడరలిస్టు, ఫెడరల్ సూత్రాలు, ఫెడరల్ నిర్మాణాలు, ఫెడరల్ వికేంద్రీకరణ. సమస్త నిర్దిష్టతలన్నీ కలిసి సార్వత్రిక సార్వజనీన స్వభావ కల్పన కేంద్రీకృత నిర్మాణ రూపం. సంస్కృతిలో వైవిధ్యం, వైవిధ్యంలో భిన్నత్వంలో ఏకత్వం, ఫెడరల్ కేంద్రీకృత నిర్మాణ స్వరూప స్వభావాలను, పరిధి, పరిమితులను పూలను కలిపి కుట్టే దారాన్ని, చెట్టుకు కొమ్మలకు గల సంబంధాన్ని తెలియ జేస్తాయి.