ఆలీబాబా-నలభై దొంగలు / Alibaba Nalabhai Dongalu
ఆకెళ్ల శివప్రసాద్ / AAKELALA SHIVAPRASAD · Novels

Price: Rs. 25. ఆలీబాబా ఒక పేద ముస్లిం. అతని అన్న పేరు కాశిం. కాశింకు భార్య వైపు నుంచి బాగా డబ్బులు వచ్చాయి. కాశిం ధనవంతుడు. సుఖంగా జీవించేవాడు. ఆలీబాబా రెక్కలకష్టంతో జీవితమనే బండి నడిపేవాడు. కాశిం అతనికి ఏనాడూ సాయం చేసి ఎరుగడు. ఆలీబాబా ఒకరోజు కట్టెలు కొట్టి తేవడానికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్లాడు. అక్కడ అతనికి అనుకోకుండా ఒక నిధి దొరికింది. అది ఒక దొంగలముఠాది. ఆ నిధి నుంచి అల్లావుద్దీన్ సంచులతో రత్నాలు, వజ్రాలు తీసుకెళ్లాడు. దానితో అతని దరిద్రం తీరిపోయింది. కాని మరో సమస్య పట్టుకొంది. ఈ విషయం అతని అన్నకి తెలిసింది. అతను కూడా ఆ నిధి నుంచి రత్నాలు వజ్రాలూ తెచ్చుకొందామని వెళతాడు. కాని అక్కడ దొంగలచేతికి చిక్కి చనిపోతాడు. తర్వాత దొంగలు అల్లావుద్దీన్ పై పగ పడతారు. అల్లావుద్దీన్ దొంగలబారి నుంచి ఎలా తప్పించుకొంటాడు, అన్నదే కథ.