ఆర్థిక, తాత్విక రాతప్రతులు - 1844 / Economic and Philosophical Manuscripts - 1844

Editor · Economics & Agriculture

ఆర్థిక, తాత్విక రాతప్రతులు - 1844 / Economic and Philosophical Manuscripts - 1844 book cover

Price: Rs. 225. సమీక్ష ప్రచురణలు తీసుకువస్తున్న ఆర్థిక, తాత్విక రాతప్రతులు - 1844 అనే ఈ పుస్తకం , Economic and Philosophic Manuscripts of 1844 అనే ఆంగ్ల గ్రంధానికి అనువాదం. 1844లో పారిస్లో మార్క్స్ తన విస్తృత అధ్యయనాల క్రమంలో రాసుకున్న నోట్సు ఈ పుస్తకానికి ఆధారం. తొలి రచనలలో ఒకటి అయినప్పటికీ, మార్క్స్ సాధించిన అసాధారణ మేధో విజయాల తొలి బీజాలు ఇందులో మనకి కనిపిస్తాయి. మార్క్స్ మేధో కృషికి మూల వనరులుగా పరిగణించబడిన ఇంగ్లీష్ రాజకీయ అర్థశాస్త్రం, జర్మన్ సాంప్రదాయక తత్వశాస్త్రం, ఫ్రెంచి సోషలిజాల, బహుశా, మొట్టమొదటి సమ్మేళనం ఈ రచనలో మనకి కనిపిస్తుంది. మార్క్సిస్టు మూల గ్రంథాలలో కమ్యూనిస్టు మానిఫెస్టో, పెట్టుబడి తర్వాత దాదాపు అంతటి ఆసక్తిని, చర్చని ఈ రాతప్రతులు రేకెత్తించింది. పెట్టుబడిదారీ సమాజం మనిషికి మనిషికి మధ్య సృష్టించిన పరాయీకరణని అధిగమించి మానవ విముక్తిని సాధించడం ఈ పుస్తకంలోని మౌలిక ప్రతిపాదన. మార్క్స్ యావత్ కృషిలో ఈ స్ఫూర్తి కొనసాగింది. మార్క్స్ స్ఫూర్తిని మరోసారి చర్చించుకోవడానికి ఈ పుస్తకం ఒక సందర్భం కావాలనేది మా కోరిక.

Browse more Telugu books