ఆరెస్సెస్, బిజెపీలు కోరుకునేది/BJP, RSS LU KORUKUNEDI
జి. రఘుపాల్ · Politics

Price: Rs. 75. సావర్కర్ ప్రతిపాదించిన హిందూత్వ సిద్ధాంతం నుండి హిందూ జాతీయవాదం ప్రేరణ పొందింది. ఆ ప్రేరణతోనే 1925లో ఆరెస్సెస్ను స్థాపించింది. దాని లక్ష్యం హిందూ జాతీయ వాదం, హిందూ రాజ్యాన్ని స్థాపించడం. భగత్ సింగ్, అంబేద్కర్, గాంధీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి వారి జాతీయవాద దృక్పథానికి ఆరెస్సెస్ సిద్ధాంతాలు భిన్నమైనవి. జాతీయోద్యమ ఆశయాలు 'స్వాతంత్య్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం'. మరో వైపున ముస్లిం సంపన్నులు, నవాబుల ప్రోద్బలంతో ముస్లిం జాతీయవాదం కూడ మరోవైపున మొదలైంది. హిందూ, ముస్లిం మతవాదులు గత చరిత్ర నుండి స్ఫూర్తిని పొందారు. ముమ్మరంగా సాగుతున్న స్వాతంత్య్ర పోరాటానికి దూరంగా ఉండిపోయారు. ఇలాంటి మతోన్మాద నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి దోహదపడేది ఈ చిన్న పుస్తకం.