ఆన్ ఫ్రాంక్ / Anne Frank

బీనాదేవి / BEENADEVI · Biographies & Auto Biographies

ఆన్ ఫ్రాంక్ / Anne Frank book cover

Price: Rs. 162. ఆన్ఫ్రాంక్ (12 జూన్ 1929- ఫిబ్రవరి 1945) యూదు బాలిక జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్ నగరంలో పుట్టింది. ఆమె నాలుగేళ్ల పాపగా ఉండగా జర్మనీ నాజీల అదుపులోకి వచ్చేసింది. ఫ్రాంక్ కుటుంబం ఆంస్టరౌంకి (నెదర్లాండ్స్) తరలి వెళ్లిపోయింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలు 1940లో నెదర్లాండ్స్ని ఆక్రమించుకొన్నారు. 1942 జూలై నుంచి నెదర్లాండ్స్లో ఉన్న యూదులను నాజీలు మరింతగా హింసించడం మొదలుపెట్టారు. అప్పుడే ఆ కుటుంబానికి రహస్యజీవనం మొదలయింది. 1944 ఆగస్టులో ఒక ద్రోహం వల్ల వారు నాజీలకు దొరికిపోయారు. దాదాపు రహస్య జీవితం గడిపినంతకాలం (12 జూన్ 1942 నుంచి 1 ఆగస్టు 1944 వరకూ) ఆన్ ఫ్రాంక్ డైరీ రాసుకొంది. నాజీల నిర్బంధ శిబిరంలో ఆమె చనిపోయింది. ఆమె తండ్రి ఒట్లో ఫ్రాంక్ తప్ప మిగిలిన కుటుంబ సభ్యులందరూ నాజీ శిబిరాల్లోనే చనిపోయారు. రహస్య కాలంలో ఆ కుటుంబానికి సహాయకునిగా ఉన్న మియప్ గీస్ చేతిలో ఆమె డైరీ భద్రంగా ఉంది. నాజీ శిబిరాన్నుంచి ఒట్టో ఫ్రాంక్ బ్రతికి బయటికి వచ్చాక ఆ డైరీని వారు ముద్రించారు. అదే మీరు చదవబోయే డైరీ .

Browse more Telugu books