ఆదివాసులు వైద్యం సంస్కృతి అణచివేత/ Adivasis Medicine, Culture, Suppression
కె.బాలగోపాల్ /K.Balagopal · Literature

Price: Rs. 95. మూడు నుండి నాలుగు వేల సంవత్సరాల క్రితం సముద్ర తీరంలోని నదీ డెల్టాలలోనూ, నదీ లోయలలోనూ, ఇతరత్రా అనుకూలమయిన ప్రాంతాలలోనూ ఆటవిక సమాజం నశించి వ్యవసాయిక వర్గ సమాజం ఏర్పడడం ప్రారంభమయింది. సముద్రతీరం లోని పల్లపు భూములు, కృష్ణ, గోదావరి, కావేరి, మహానది, నర్మద, తపతి, ఇతర ఉత్తర భారతదేశపు నదులు - ఒక్కొక్కటీ ఒక్కొక్క కేంద్రమయింది. ఈ ఒక్కొక్క కేంద్రంలో ఏర్పడ్డ వర్గ సమాజం ఒక్కొక్క 'జాతి'కి (తెలుగు, తమిళ, మలయాళ, మరాఠా, ఒరియా వగైరా) బీజమయింది. ఈ జాతులు ఆ కేంద్రం నుండి వీలయినంత దూరం విస్తరిస్తూ అడవులను మైదానాలను చేస్తూ అక్కడి ఆటవికులను తమలో బలవంతంగా కలుపుకుంటూ పోయాయి. ఈ విధంగా ఒక్కొక్క ఆధునిక జాతి ఏర్పడింది. ఒక జాతికీ మరొక జాతికి మధ్య వాటి విస్తరణకు ఇంతవరకు లొంగని అడవులు, పీఠభూములు మిగిలిపోయాయి. అక్కడ నివసించే ఆటవికులు ఆర్థికంగా ఇప్పటికీ ఆటవికులుగానూ, సాంస్కృతికంగా ఏజాతికి చెందనివారుగానూ మిగిలి పోయారు. అందుకే మన దేశంలో ఏ రెండు పరిసర రాష్ట్రాలను తీసుకున్నా వాటి సరిహద్దుల్లో అడవులు, కొండలు, పీఠభూములు, అక్కడ నివసించే గిరిజనులు కనబడతారు. ఏ రాష్ట్రంలోనూ రాష్ట్ర గర్భంలో గిరిజనులు కనబడరు... బ్రిటిష్ వాళ్ల కాలం నుండి ఇప్పటిదాకా మన దేశం సాధించిన 'అభివృద్ధి' వల్ల అత్యధికంగా నష్టపోయింది గిరిజనులే. అత్యధికంగా ఈ 150 సంవత్సరాలలో తిరుగుబాట్లు చేసింది కూడా గిరిజనులే. -కె.బాలగోపాల్