ఆదివాసులు చట్టాలు అభివృద్ధి /Adivasis Laws Development
కె.బాలగోపాల్ /K.Balagopal · History

Price: Rs. 117. అందమైన చట్టాలను నమ్ముకొని నష్టపోయామా అన్న ప్రశ్న ఆదివాసులు ఇవ్వాళ వేసుకుంటున్నారు. నిజానికి తప్పు అక్కడ లేదు. చట్టం వచ్చేసింది కాబట్టి ఇంక రాజకీయ సమీకరణ అక్కరలేదన్న నిర్లక్ష్యంలో ఉంది. మనది ప్రాథమికంగా నిజాయితీలేని పాలనా వ్యవస్థ. ప్రజల ఒత్తిడికి, ప్రజాతంత్ర ఉద్యమాల ఒత్తిడికి తలొగ్గి చట్టాలు చేస్తుందిగానీ అవి అమలు కాకుండా ఉండడానికి ఎంత చెయ్యాలో అంతా చేస్తుంది. అందువల్ల ప్రజల వైపు నుండి రాజకీయ ఒత్తిడి కొనసాగడం అవసరం. కమ్యూనిస్టుల వంటి రాజకీయశక్తులు చట్టాలనూ వాటి అమలునూ అసలే పట్టించుకోకుండా ఒక రకంగా నష్టం చేస్తే, ఎన్జీవోలు వచ్చి చట్టం ఉంటే ఇంక రాజకీయ ఉద్యమాలెందుకు అని అటువైపు నుండి అంతే పొరపాటు చేస్తున్నాయి. కె.బాలగోపాల్