ఆచరణవాది / ACHARANAVAADI
టి.ఎన్. వెంకట రమణ / T.S VENKATA RAMANA · Biographies & Auto Biographies

Price: Rs. 75. కమ్యూనిస్టు అంటే విప్లవ సిద్ధాంతాలు, పోరాట స్వభావమూ మాత్రమే కాదు. సంపూర్ణ మానవుని సకల లక్షణాలూ కమ్యూనిస్టులో ఉండాలి. కమ్యూనిస్టులంటే హింసావాదులని చాలామంది అనుకుంటారు. నిజానికి కమ్యూనిస్టు వ్యతిరేకులు అలా ప్రచారం చేస్తుంటారు. కానీ నిజమేమంటే అత్యధిక ప్రజానీకాన్ని దుర్బర దారిద్ర్యానికి ఈతి బాధలకు గురిచేసే పెట్టుబడిదారీ విధానం పట్ల కమ్యూనిస్టులకుండే వర్గ కసి ప్రజల పట్ల ఉండే ప్రేమ, ఉదార హృదయం నుండే ఉద్భ విస్తుంది. అందువల్ల ప్రతి మానవతావాదీ కమ్యూనిస్టు కాకపోవచ్చును కానీ ప్రతి కమ్యూనిస్టు తప్పనిసరిగా మానవతావాది (మానవుని సకల సద్గుణాలు కలిగినవాడు) గా ఉంటాడు. అలాంటి మానవతా లక్షణాలతో, సహృదయుడిగా అందరి మనన్ననలు పొందిన ఉత్తమ కమ్యూనిస్టు కామ్రేడ్ రమణ. ఈ పుస్తకంలో కామ్రేడ్ రమణ గురించిన అనేక విషయాలు, మనం నేర్చుకోదగిన అంశాలు, అనేక మంది కామ్రేడ్స్ సందేశాల ద్వారా వెల్లడించారు. ప్రజా ఉద్యమ శ్రేయోభిలాషులంతా చదవాల్సిన పుస్తకం ఇది.