ఆఖరి వడ్లగింజలు / Akhari Vadlaginjalu

Geethanjali / గీతాంజలి · Books

ఆఖరి వడ్లగింజలు / Akhari Vadlaginjalu book cover

Price: Rs. 135. Beom తెలంగాణ ఏర్పడింది. వలసలు అలాగే మిగిలాయి. లక్ష్మి మాత్రం 2 జూన్ 2014 న గీతాంజలి ఇంట్లోనే తెలంగాణ ఏర్పడిందన్న వార్త విని ఇంక తన ఊరికి నీళ్లొస్తాయని, పని దొరుకుతుందని ఊరికి పోయింది. తాను ప్రారంభించిన లక్ష్మి కథ పూర్తి చేయడానికి తెలంగాణ వచ్చిన తర్వాత తన ఇంటికి, ఊరికి పోయిన లక్ష్మి ఇంటికి గీతాంజలి పోయింది. అక్కడ ఆమె లేదు. ఒక్క మరదలు మాత్రమే ఉంది. ఆమె బాబాయి, చిన్నమ్మల వెంట గుజరాత్ కి వలస పోయిందని చెప్పింది. మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల పాకాల ప్రాజెక్టులు వస్తున్నాయి. నెట్టెంపాడు, భీమా పథకాలు వస్తున్నాయి. చెరువుల పూడికలు పొక్లెయినర్లతో తీయించే కాకతీయ మిషన్ యజ్ఞాలు జరుగుతున్నాయి. కాని లక్ష్మి లాంటి వాళ్ళు మాత్రం వలసలు పోతూనే ఉన్నారు. పోలేపల్లి నుంచి వలసలు పోయిన వాళ్లు, పాలమూరు నుంచి వలసలు పోయిన వాళ్లు ఆత్మహత్యలతో, ఎయిడ్స్తో ఆకలితో చచ్చిపోతూనే ఉన్నారు. - వరవరరావు ఒక పుస్తకం చదివాక అందులో రచయిత లోకానికి చెప్పదల్చిన విషయం స్పష్టంగా తేటతెల్లం అయితే అది మంచి పుస్తకం కింద లెక్క ఆ పుస్తకంలోని విషయాలు పాఠకుల జ్ఞానేంద్రియాలకు అనుభూతమైతే అది గొప్ప సాహిత్యం అని అంటారు. టాల్బాయ్ రాసిన 'ఇవాన్ ఇల్యీచ్ మరణం' కథ చదివాక మరణం దాదాపు మన దగ్గరికి వచ్చినట్లు అనిపిస్తుంది. మరణ వేదన ఛాయలు మనల్ని వెన్నాడతాయి. మరణాన్ని దాదాపుగా అనుభూతి చెందుతాము. గీతాంజలి రాసిన 'పాలమూరు వలస బ్రతుకు చిత్రాలు' పుస్తకం చదివిన తరువాత కూడా ఆకలిని, కరువును అనుభూతిస్తాము. అంతటి ప్రభావం కలిగించగలిగిన పుస్తకాలు అరుదుగా ఉంటాయి. రచయిత్రి ఈ పుస్తకం రాస్తూ ఎంత వేదనను అనుభవించిందో ఆ వేదనకు సహానుభూతి కంటే ఎక్కువ లెవెల్లో అనుభూతి పాఠకులకు కలిగి తీరుతుంది. 'పథేర్ పాంచాలి' నవలలో రచయిత బిభూతిభూషణ్ బంధోపాధ్యాయ బీద బ్రాహ్మణ కుటుంబంలో చిత్రీకరించిన ముసలమ్మ ఆకలి చావూ, పేదరికం కాటేసిన దుర్గ చావూ భారత సమాజాన్ని కదిలించివేశాయి. కరువు, ఆకలి కధా వస్తువులుగా 'మాలపల్లి', 'అంటరాని వసంతం' కలిగించిన ప్రకంపనాలు తక్కువవి కావు. వాస్తవాలు తెలుసుకోదలిచిన

Browse more Telugu books