ఆంధ్ర రాష్ట్రంలో వామపక్ష ఉద్యమ చరిత్ర 1934-56 / ANDHRA RASHTRAMALO VAAMAPAKASHA UDYAMA CHARITRA 1934-56
డా॥ కె. రమేష్ / Dr. K.Ramesh · History

Price: Rs. 144. ఈ గ్రంథంలో డా॥ రమేష్ 1934-1956 సంవత్సరాల మధ్య ఆంధ్రప్రాంతంలో కమ్యునిస్టు ఉద్యమాల కీలకదశని సమతౌల్యంతో, లక్ష్యాత్మకంగా సానుభూతి దృక్పథంతో ఉద్యమబలాల్ని, బలహీనతల్నీ చక్కగా విశ్లేషించారు. నా దృష్టిలో ఇదొక సాధికారగ్రంథం. వామపక్ష ఉద్యమ బహుముఖ స్వభావాన్ని ఒక చారిత్రక రచనా సంవిధానంతో క్షుణ్ణంగా విశ్లేషిస్తూ, ఆసక్తికర సిద్ధాంతచట్రంలో వివేచన చేస్తూ వెలుగులోకి వచ్చిన పుస్తకం ఇది.. - ప్రొ|| అడపా సత్యనారాయణ ఆంధ్రప్రాంతంలో వామపక్షాలు, కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ, జాతీయోద్యమాన్ని ఎంత ప్రగతిశీలకంగా మలిచారో కమ్యూనిస్టు యువత దాన్ని ఎంత విప్లవాత్మకంగా తీర్చిదిద్దిందో ఒక చక్కని చారిత్రక దృక్కోణంతో ఈ పుస్తకం ఆవిష్కరించింది. సమకాలీన ఆంధ్ర చరిత్ర పుటలకు ఈ గ్రంథం ఒక అదనపు చేర్పుగా సాధారణ చదువరికి చక్కని వనరుగా, విద్యార్థులకూ, సామాజికవేత్తలకు ఒక ఉపయుక్త గ్రంథంగా, ప్రజా ఉద్యమాలు నిర్మిస్తోన్న ఎందరో ఉద్యమకారులకు ఇదొక కరదీపికగా వెలుగులందిస్తుంది.