ఆంధ్రుల సంస్కృతి-చరిత్ర 1 / Andhrula Sanskruti Charita - 1
Kambhampati Satyanarayana / కంభంపాటి సత్యనారాయణ · History

Price: Rs. 135. ఆంధ్రుల సంస్కృతి-చరిత్రను గురించిన యీ గ్రంథం ఒక స్పష్టమైన, నిర్దిష్టమైన సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని వ్రాయబడింది. ఇంతవరకు ఎవరూ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినంతవరకు ఇట్టి ప్రయత్నం చేసి వుండలేదు. అందువల్ల యిది విలువైనదీను, విజ్ఞులు పరిశీలించదగ్గది కూడా. రచయిత స్వాత్రంత్య సమరంలో పాల్గొని, 1930 నుంచి 1947 వరకు 4 సంవత్సరాలకు పైగా జైల్లో నిర్బంధింపబడ్డారు. స్వాతంత్ర్యానంతరం 1948-49 మధ్య కడలూరు జైల్లో డిటెన్షన్, 1949-51 మధ్య రహస్య జీవితం. 1931 నుంచి కమ్యూనిస్టు కార్యకర్తగాను, "నవశక్తి" "ప్రజాశక్తి", "విశాలాంధ్ర", "సందేశం" పత్రిక సంపాదకవర్గ సభ్యుడుగాను, రాజకీయ అధ్యాపకుడుగాను ఉన్నారు. 1968 నుంచి చరిత్ర పరిశోధనలో నిమగ్నులైనారు. ఇండియన్ హిస్టరీ కాంగ్రెసులో సభ్యులు. ఆం.ప్ర. హిస్టరి కాంగ్రెసు కార్యనిర్వాహక సభ్యుడుగా పనిచేశారు. రచనలు : "గత తార్కిక భౌతికవాదం", "లక్ష్యాలు-సాధనాలు", "నేటి రష్యా', “బంగ్లాదేశ్ స్వాత్రంత్య సంగ్రామం”, “అర్థ శతాబ్దకాలంలో ఆంధ్రులపై అక్టోబరు విప్లవ ప్రభావం", "కమ్యూనిస్టు నీతి", అనే సంకలన గ్రంథం. ఆయన చివరి రచన "ఆంధ్రప్రదేశ్లో కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర". ఇవిగాక అనేక మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాలను అనువదించారు.