అసెంబ్లీలో ఒకే ఒక్కడు / ASSEMBLY LO OKEOKKADU
డాక్టర్ షేక్ హసీనా / Dr.SHAIK HASEENA · Politics

Price: Rs. 65. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సం||లుగా సిపిఐ అభ్యర్థి అసెంబ్లీలో లేకపోవడం విచాకరమే. బలమైన ఉద్యమం, సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీకి ఉద్యమాల చరిత్ర వుంది. ఆ ఉద్యమం ప్రతిబింబించే పద్ధతిలో చట్టసభల్లో సిపిఐ ప్రాతినిధ్యం లేకపోవడం పీడిత తాడిత ప్రజలకు లోటు కన్పించింది. దీనిని బట్టి పార్టీ బలానికి, ఎన్నికల వ్యవస్థకి తారతమ్యం కన్పిస్తుంది. రాజకీయ వ్యవస్థనే కాకుండా ధనబలం, కులబలం, రాజకీయాలను శాసించే స్థాయికి ఎదగడం ప్రజాస్వామ్య ఉద్యమానికి నష్టమే. గత టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు పరిపాలన సాగించ లేకపోయింది. ఏ ప్రజా ఉద్యమం చేత తెలంగాణ సాధించుకొన్నామో, ఆ ప్రజాస్వామ్యానికే అపకీర్తి తీసుకొచ్చే పద్ధతులు టిఆర్ఎస్ పాలన సాగింది. మొత్తంగా టిఆర్ఎస్ వైఫల్యాలను విశ్లేషించాలంటే, అవినీతి, అహంభావం, నియంత విధాన పోకడల వల్లే ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలోనే జాతీయ స్థాయిలో ఇండియా కూటమికి అనుకూలంగా తెలంగాణ రాష్ట్రంలో ఎత్తులు, పొత్తులు సక్రమంగా అమలు చేసిన ఫలితంగా సిపిఐకు కొత్తగూడెం నుంచి సాంబశివరావు గెలవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం శుభసూచికం. ఏ బూర్జువ రాజకీయ పార్టీ ఉన్నప్పటికీ, శాసనసభలో కమ్యూనిస్టు ఒకడున్న వర్గ దృక్పథంతో తమ వాణిని వినిపించగలడు. ఈ సందర్భంగా, డా॥ హసీన 56 పేజీల బుక్లెట్ తీసుకురావడం గతంలో కమ్యూనిస్టు పార్టీ కోసం పనిచేసిన త్యాగధనుల చరిత్రను ఈ బుక్లెట్లో సులభ పద్ధతులు అర్థమయ్యే విధంగా తయారు చేసిన డా॥ హసీనకు అభినందనలు. భారత కమ్యూనిస్టు పార్టీ 99 వార్షికోత్సవాలు సందర్భంగా ఈ బుక్లెట్ తీసుకురావడం పట్ల అభినందిస్తున్నారు.