అష్ఫాఖ్ - బిస్మిల్ / Ashphakh - Bismil
Vijayaharam Ramanamoorthy / విజయహారం రమణమూర్తి · Novels

Price: Rs. 112. అష్ఫాఖ్-బిస్మిల్ అద్భుత అమర గాధ' పుస్తకం మొదట 2018 మార్చి 25న ఎల్బీనగర్లోని జైభారత్ కేంద్ర కార్యాలయం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భవన్లో ఆవిష్కరించుకోవడం జరిగింది..! కేవలం 2-3 గంటలు జరగాలని నిర్దేశించిన కార్యక్రమం అత్యంత ఉద్వేగభరితంగా, నిరవధికంగా.. రెండు రోజులు జరగడం.. జైభారత్ చరిత్రలో ఒక అపురూపమైన ఘట్టం..!! ఆనాటి సమావేశంలో పాల్గొన్న అందరికీ.. అది జీవితకాలం గుర్తుంచుకునే.. అపురూపమైన జ్ఞాపకం..!!! ఈ పుస్తకాన్ని తర్వాత.. జైభారత్ ఉద్యమం అధ్వర్యంలో.. (ప్రతి ఏటా డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకూ) జరిగే.. 'హిందూ-ముస్లిం ఐక్యతా దినా'ల సందర్భంగా 2018-19లో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో.. 230కి పైగా.. సమైక్యతా సభలు/సమావేశాల్లో ఆవిష్కరించుకోవడం జరిగింది..! ఈ హిందూ-ముస్లిం ఐక్యతా దినాల కార్యక్రమానికి.. అష్ఫాఖ్-బిస్మిల్లతో సంబంధం ఉంది. ఈ మహనీయులు అమరులైన డిసెంబర్ 19 నుంచే.. ఈ 'ఐక్యతా దినాల' కార్యక్రమం ప్రారంభం అవుతుంది, గాంధీజీ అమరుడైన జనవరి 30తో ముగుస్తుంది. ఆ విధంగా... అప్పాభ-బిస్మిల్లతో.. జైభారత్ ఉద్యమానికి దశాబ్దంన్నర క్రితమే.. ప్రగాఢమైన అనుబంధం ఏర్పడింది..