అవుట్లుక్ / OUTLOOK

ఎం.విప్లవకుమార్ / M.Viplava Kumar · Stories & Poetry

అవుట్లుక్ / OUTLOOK book cover

Price: Rs. 225. అకడమిక్ క్రమశిక్షణ, తాత్త్విక లోతు, సామాజిక చైతన్యం, భాషా శిల్పం విప్లవకుమార్ పరిశోధనలో సమన్వయమై ఉన్నాయి. ఇది సాహిత్య విమర్శలో సాంఘిక చైతన్యానికి శాస్త్రీయ రూపాన్ని ఇచ్చింది. యాదయ్య కవిత్వం మీద చేసిన ఈ విశ్లేషణ, తెలుగు విమర్శా రంగంలో దళిత- బహుజన సాహిత్యాన్ని ప్రధాన ప్రవాహంలోకి తీసుకురావడానికి దోహదపడుతుంది. ఈ పరిశోధనా గ్రంథం భవిష్యత్ పరిశోధకులకు అనేక విధాలుగా ఒక నమూనాగా (Model) ఉపయోగపడుతుంది. తెలంగాణ దళిత కవిత్వంపై కొత్త కోణాల్లో పరిశోధన చేయడానికి, యాదయ్య వంటి కవుల కవిత్వాన్ని అంతర్జాతీయ సాహిత్య సిద్ధాంతాలతో అనుసంధానం చేయడానికి, తులనాత్మక దళిత అధ్యయనాల (Comparative Dalit Studies) దిశలో పరిశోధనలను విస్తరించడానికి ఈ రచన ఉపయోగపడుతుంది. -ప్రొఫెసర్ గంపా వెంకట రామయ్య గాఢమైన కవితా వాక్యాలు ఎవరో ఒకరిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయనడానికి విప్లవకుమార్ వర్తమాన సాక్ష్యం. బెల్లి యాదయ్య కవిత్వం అర్హత, సామాజిక తాత్వికత, సమకాలీన అంశాలను భావుకతా స్పర్శతో వ్యక్తపరిచే తీరు ఎవరినైనా ప్రభావితం చేస్తుంది. ఈ క్రమంలో విప్లపకుమార్ సాహిత్య సృజన పరిశోధనా రంగంలోకి మారింది. ఈ పరిశోధనలో భావచిత్రాలు, అలంకారికత, సంభాషణాత్మకత, ప్రతీకలు, భాషాప్రయోగాలు అనే భాగాల క్రింద శిల్ప వైవిధ్యాన్ని వివరించాడు. వచన కవిత్వంలో భావచిత్రాలను, ముఖ్యంగా 'రూపాత్మక భావచిత్రాలు' పట్టుకోవడం క్లిష్టమైన పని, నిరంతర పఠనం, రసాస్వాదన వల్లే వచన కవితలోని భావచిత్రాలను, పట్టుకోవడం సాధ్యమవుతుంది. ఆ పనిని పరిశోధకుడు నిశితమైన దృష్టికోణంతో విశ్లేషించాడు. -డా. ఎస్. రఘు

Browse more Telugu books