అల్లూరి సీతారామరాజు / ALLURI SEETHARAMARAJU

పడాల రామారావు/ PADALA RAMAROA · History

అల్లూరి సీతారామరాజు / ALLURI SEETHARAMARAJU book cover

Price: Rs. 108. పడాల రామారావు గారు తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రిలో జన్మించారు. 1942 పూర్వం నుండి రాజకీయ రంగంలో వుంటూ, భారత కమ్యూనిస్టు పార్టీ ఆశయసాధనకు నిర్విరామంగా కృషి చేసిన పడాల రామారావు సాహిత్య కృషి 'ఖైదు' నవలతో ప్రారంభమైంది. ఇప్పటికి 90 సాంఘిక, చారిత్రక, పౌరాణిక రచనలు చేశారు. అందులో నవలలు, కథలు, నాటకం, నాటికలు, బుర్రకథలు మొదలగు సాహిత్య ప్రక్రియలున్నాయి. వీటిలో అల్లూరి సీతారామరాజు నాటకం, నవల, మార్క్స్-ట్రేడ్ యూనియన్లు, విప్లవమహాయుగం, కళాపూర్ణోదయం, అశోక్ సామ్రాట్ ముఖ్యమైనవి. అత్యంత ప్రజాదరణ పొందిన వీరి రచనలు బొమ్మల భాగవతం, పిల్లల బొమ్మల రామాయణం, బాలల బొమ్మల భారతం, సంపూర్ణ బాలల బొమ్మల పంచతంత్రం కథలు, వాల్మీకి రామాయణం, కవిత్రయ మహాభారతం, పోతన మహాభాగవతం, అల్లూరి సీతారామరాజు మొదలగునవి. బాలల 1942 పూర్వం నుండి రాజకీయ రంగంలోవున్నా, 1942 జూలైలో భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. రాజమండ్రి పట్టణ కమ్యూనిస్టు సమితి కార్యదర్శిగానూ, ఆం.ప్ర. రాష్ట్ర కమ్యూనిస్టు సమితి సభ్యులుగానూ వుంటూ పార్టీ ఆశయ సాధనకు కృషిచేశారు. ప్రముఖ రచయితగా, జర్నలిస్టుగా, సామాజిక కార్యకర్తగా తెలుగు ప్రజలకు సుపరిచితులైన పడాల రామారావు 2006, ఏప్రిల్ 4న తుదిశ్వాస విడిచారు.

Browse more Telugu books