అరవింద కథలు/ ARAVINDA KATHALU
ఎ.ఎస్.మణి /A.S.Mani · Books

Price: Rs. 180. జీవితం అంటే ఏమిటీ అనే అన్వేషణను తన రచనలన్నింటికి ప్రాతిపదికగా చేసుకున్న ఈ రచయిత్రి పూర్తి పేరు అన్నంరాజు సుగుణ మణి (ఎ.ఎస్. మణి). ఏలూరు సి.ఆర్.రెడ్డి. కాలేజీలో చదివి, 1954లో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్న గ్రాడ్యుయేట్. ఉద్యోగ రీత్య జంషెడ్పూర్ లో నివాసం. కాలేజీ రోజుల్లోనే రచన మొదలు పెట్టినా, 1959లో ఆంధ్రపత్రిక వారపత్రికలో ప్రచురితమైన కథ 'అల్లుడు మంచితనం' ఈ రచయిత్రి సాహితీ ప్రస్థానానికి మొదటి మైలురాయి, సంపాదకుల ప్రశంసనందుకున్న కథ. వందకు పైగా కథలు రాశారు. వివిధ కథల పోటీలలో ఆమె కథలు బహుమతులు పొందాయి. 'మూడు కోణాలు', 'చేతులు కాలాయి', 'జీవితానికి ఎన్ని రంగులో...' మచ్చుకి కొన్ని. పదికి పైగా ప్రచురితమైన నవలలో సాహితీ పోటీలలో నిలబడి నిగ్గు నిరూపించుకున్న నవలలు 'పగిలిన ప్రతిమ' (1971), 'జలసూర్య' (1976), పాఠకుల విశేష ఆదరణ, రచయితల ప్రశంసలందుకున్న నవల 'అవతలి గట్టు' (1973) . జీవితం గురించిన అన్వేషణ, స్వతంత్రమైన ఆలోచన, గాఢమైన అవగాహన, మంచీచెడుల మనోవిశ్లేషణ ఈమె రచనల్లో ప్రతిఫలిస్తాయి. మన సంస్కృతి సాంప్రదాయల పట్ల అభిమానంతో పాటు ఆధునిక అభ్యుదయ భావాలకి ఆదరణ ప్రకటితమౌతుంది. 'అరవింద' రచనలలో సర్వకాలిక మానవత్వపు విలువలు, సంఘర్షణ, జీవిత సత్యాల అన్వేషణ, వాస్తవిక దృక్పథం ప్రస్ఫుటమౌతాయి. 1972లో పిల్లల నవల 'ప్రేమమంత్రం' ఆంధ్రప్రదేశ సాహిత్య అకాడమి అవార్డు పొందింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అవార్డులు రెండు, గృహలక్ష్మి, స్వర్ణకంకణం మొదలైన పురస్కారాలు వీరికి లభించాయి.