అమ్మా నాన్నా/AMMA NANNA
Justice B. Chandra Kumar / జస్టిస్ బి. చంద్రకుమార్ · Novels

Price: Rs. 95. జస్టిస్ చంద్రకుమార్ గారి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ 'అమ్మానాన్నా' అనే ఈ పుస్తకంలో చోటు చేసుకున్నాయి. పుస్తకం పేరునుబట్టి అమ్మానాన్న గురించి మాత్రమే రాశారేమో అనిపిస్తుంది. కాని తల్లిదండ్రుల పెంపకంలో తానెట్లా అభ్యుదయమార్గంలో నడిచాడో చంద్రకుమార్ గారు చక్కగా వివరించినారు. 'అమ్మానాన్నా' అనే ఈ చిన్న పుస్తకం ఒక విధంగా చంద్రకుమార్ గారి 'స్వీయ చరిత్ర' యేమో అనిపిస్తుంది. స్వధర్మం నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా వైదొలగరాదనే తలంపు చంద్రకుమార్ గారిలో బాల్యంలోనే కల్గిందని చెప్పవచ్చు. స్నేహితులన్న అరమరికలు లేని ప్రేమను చూపెట్టడం బాల్యంలోనే అలవర్చుకున్నారు. కులమతాల కతీతంగా తోటి విద్యార్థులకు తన తల్లి ఇంట్లో భోజన సదుపాయం కల్గించడం మామూలు విషయం కాదు. చంద్రకుమార్ గారికి తల్లి తండ్రుల నుంచి సంక్రమించినవి ఆస్తులు కావు. అంతస్తులు కావు. ధార్మిక ప్రవృత్తి, సత్యనిష్ట, అన్నింటిని మించి మానవతా దృక్పథం. ఈ చిన్న పుస్తకం కేవలం జ్ఞాపకాలకే నెలవు కాదు. ఎన్నో అనుభవాలకు పుట్టినిల్లు. పాఠకులు తప్పకుండా ఈ పుస్తకాన్ని చదివి ఈ పూర్వ జ్ఞాపకాలను నెమరేసుకుంటారు. తల్లిదండ్రుల ప్రభావం తమపై ఎలా ఉందో కూడా బేరీజు వేసుకుంటారు.