అపురూప చింతన కథలు / Apurupa Chintana Kathalu
బి. అజయ్ ప్రసాద్ / B. Ajay Prasad · Books

Price: Rs. 247. రెండురెళ్ళు ఐదయితే అది నాకు అందం' అని చెప్పే కథలివి. తార్కికత, హేతుబద్ధత, నిశ్చిత నిర్ణయాలు, కొలత బద్దలకు అతీతంగా స్వేచ్ఛను తీసుకున్న కథలివి. జీవితమూ, ప్రపంచం పట్ల అవగాహనను నేల పైనుండీ ఒక అంగుళం పైకి లేపగలిగిన కథలివి. ఈ కథలన్నింటినీ అచ్చమైన అస్తిత్వవాద కథలనీ, transcendental కథలనీ పిలవవచ్చునేమో. ఈ కథల్లో పాత్రలు, వాటి ప్రవర్తన, సంభాషణలు, వాటి భవితవ్యాలు మామూలు కథల్లో వాటికంటే భిన్నంగా అగుపిస్తున్నాయి. నీలిమేఘం ఆకుపచ్చని అడవితో మాట్లాడే భాష... ఎవరికీ కనిపించని వ్యక్తులతో సంభాషించే పాత్రలు... కొండలు, గుట్టలు చెప్పే మాటలు ఈ కథల్లో వినిపిస్తాయి. "చీకటిని బంతాడే సూర్యుడిలాగా, మరో ప్రపంచపు కలలాగా, స్వప్నాలకే స్వప్నంలాగా సంభాషించే" పాత్రలు, దేవుడు కలిగించే సుఖ దుఖాలకు ఎదురెళ్ళి అటకాయించిన పాత్రలు కనిపిస్తాయి.