అఖిల భారత కిసాన్ సభ / Akhila Bharatha Kisan Sabha

హన్నన్ మొల్ల / Hannan Mollah · Politics

అఖిల భారత కిసాన్ సభ / Akhila Bharatha Kisan Sabha book cover

Price: Rs. 135. హన్నన్ మొల్ల గారు పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ్ బౌరియా గ్రామంలో 1946 జనవరి 3న శ్రామిక కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి దివంగత అబ్దుల్ లతీఫ్ జూట్ మిల్లు కార్మికుడు. అతని తాత ముబారక్ మొల్ల వ్యవసాయ కార్మికుడు. అతను సాధారణ విద్యాలయంలో చదువుకున్నాడు. కలకత్తాలోని సిటి కాలేజి నుండి పట్ట భద్రుడయ్యారు. కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పొలిటికల్ సైన్స్లో యంఎ పట్ట పొందారు. పాఠశాల విద్య చదువుతున్న క్రమంలోనే ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్లో చేరారు. 1959లో ఆహార ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 80 మందిని చంపింది. ఏఐఎస్ఎఫ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పని చేశారు. 60వ దశకం ప్రారంభంలో యువజన ఉద్యమంలో చేరారు. డివైఎఫ్ఐ వ్యవస్థాపకులలో ఒకరు. హౌరా జిల్లా అధ్యక్షులుగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు. తరువాత జాతీయ స్థాయిలో పని చేశారు. 1980లో డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డివైఎఫ్ ఐ) వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. 1992 వరకు ఆ బాధ్యతలో కొనసాగారు. 1993లో ఆలిండియా అగ్రికల్చర్ వర్కర్స్ యూనియన్ లో చేరి అఖిల భారత సహాయ కార్యదర్శిగా 16 సంవత్సరాలు పని చేశారు. 2009లో అఖిల భారత కిసాన్ సభలో చేరారు. 2013లో కడలూర్ లో జరిగిన ఏఐకెఎస్ 33వ మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. 2017లో హిస్సార్ లో జరిగిన 34వ అఖిల భారత మహాసభలో తిరిగి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనారు. 1961లో కమ్యూనిస్టు పార్టీలో చేరిన ఆయన పార్టీ చీలిక తరువాత సిపిఐ(యం)లోనే కొనసాగారు. 1982లో సిపిఐయం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీకి 1986లో జరిగిన పార్టీ అఖిల భారత మహాసభలో కేంద్ర కమిటీకి ఎన్నికైనారు. పార్టీ 21వ మహాసభలో పొలిట్యూరోకు ఎన్నికైనారు. 1980లో పశ్చిమ బెంగాల్ లోని ఉలు బెరియా నియోజకవర్గం నుండి లోక్ సభకు ఎన్నికైనారు. అదే నియోజవర్గం నుండి వరుసగా 8 సార్లు (7వ లోక్ సభ నుండి 14వ లోక్ సభ వరకు) ఎన్నికయ్యారు.

Browse more Telugu books