అక్షర విన్యాసములు / Akshara Vinyasamulu
అగ్రహారం సత్యనారాయణ / Agraharam Satyanarayana · Telangana Literature

Price: Rs. 270. ఉద్యోగ నిర్వహణలో భాగంగా ప్రయాణించడము అప్పట్లో తప్పలేదు. ప్రయాణించే సమయంలో వివిధ మ్యాగజైన్లు చదవడం, వాటిలోని పజిల్స్ పూరించడం పరిపాటిగా మారింది. ఆ పూరించిన పజిల్స్ ను ఆయా పత్రికలకు పంపి, కరెక్టుగా పూరించిన వారి జాబితాలో నా పేరు చూసుకుని సంబరపడడం జరిగేది. అల్జీమర్స్ రాకుండా వుండాలంటే పజిల్స్ నింపడము, మెదడుకు పదును పెట్టడం చేయాలని తెలుసుకున్న నేను పజిల్స్ను తయారు చేసి పంపడం ఓ వ్యాపకంగా మారింది. అంతకుముందు ఉద్యోగం చేసినపుడు సెలవుల్లో పజిల్స్ తయారు చేసి పెట్టుకున్న నేను పదవీవిరమణ తరువాత 2010 నుండి 2014 వరకు వివిధ పత్రికలలో పజిల్స్ ప్రచురణ జరిగింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో దాదాపు 220 పైగా తెలుగు, ఇంగ్లీషు పజిల్స్ ప్రచురించబడినవి. వాటి సంకలనం చేద్దామనుకొని వాటితో పాటు మరిన్ని పజిల్స్- ఓ పుస్తకంలో తేవాలని సంకల్పించాను. వాటిని ఏదైనా ప్రయోజనం కోసము ప్రచురింప చేయాలన్న సంకల్పముతో - తెలుగు భాషను ఈ పజిల్స్ ద్వారా వ్యాప్తి చెందాలని అక్షర విన్యాసాలు గల ఈ పజిల్స్ ద్వారా.... వ్యాప్తి చెందించాలని అక్షర విన్యాసాలు గల ఈ పజిల్సు ఓ పద్ధతి ప్రకారము ఏర్పికూర్చి తెలుగు భాషను మరింత సులువుగా - ఓ ఆటలాగా నేర్చుకునే విధముగా తయారు చేయడము జరిగింది. అందులో భాగముగా పజిల్స్ను 6 విభాగాలుగా చేసి అందించడం జరిగింది. పదవలయాలుగా, పద వృక్షములుగా తయారు చేయడం చేస్తే చూడడానికి బాగుంటాయి. కానీ స్థలము ఎక్కువ కావలసి వచ్చి కొన్ని పజిల్స్నే పుస్తకంగా చేయడం కాకుండా, తక్కువ స్థలముతో వీలైనన్ని పజిల్స్ చేయడం జరిగింది. మొదటిగా ప్రథమాక్షరిని ప్రయోగించి అంటే ప్రథమ, మొదటి అక్షరాలు వరుసగా ఒక్కటే వచ్చేట్లు పజిల్స్ తయారు చేయడం జరిగింది. ప్రథమాక్షరిని ఇచ్చి వాటితో మరిన్ని పదములను వ్రాసేట్లు చేసాము.