అక్కినేని ఆణిముత్యాలు / AKKINENI AANIMUTHYALU

ఎస్.వి.రామారావు / S.V. Ramarao · Biographies & Auto Biographies

అక్కినేని ఆణిముత్యాలు / AKKINENI AANIMUTHYALU book cover

Price: Rs. 135. దశాబ్దాలుగా చిత్రసీమలో ఉన్న అలనాటి హాలీవుడ్ హీరోలు గ్రెగరీ పెక్, మార్లన్ బ్రాండో, కేరీ గ్రాంట్, రిచర్డ్ బర్టన్ నటించిన సినిమాల సంఖ్య పరిమితంగా, సరాసరిన 50 ఉంది. హిందీ అగ్రహీరోలైన దిలీప్ కుమార్, రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, రాజేంద్ర కుమార్ల సరాసరి 80 ఉంది. ఆనాటి దక్షిణాది హీరోల సినిమాల సంఖ్య మాత్రం వందల్లో ఉంది. వివిధ తరహా పాత్రలు ధరించడం ఒక కారణమైతే, పారితోషికం తక్కువ కాబట్టి పలుచిత్రాల్లో నటించవలసిన అగత్యం మరో కారణం. ఫలితంగా మన హీరోల సినిమాల్లో అనేకం ఒకే మూసలో తయారై 'ఫర్వాలేదు' కేటగిరీ తెచ్చుకోవడం, నటుడిపై 'స్టీరియో టైవ్' ముద్రపడడం సంభవించింది. ఆ నటుడి సినిమాలన్నిటినీ పాఠకుడి ముందు పరిస్తే కథానాయకుడికి అన్యాయం చేసినట్లే! అందుకని క్షీరనీర న్యాయం పాటించి, వైవిధ్యాన్ని కనబఱచే ఆణిముత్యాలను ఏరి అందమైన హారంగా కూర్చితే అది ఆ హీరోకి సవ్యమైన శ్రద్ధాంజలి అవుతుంది. నవరత్నహారంలో అమరాల్సిన వజ్రాల ఎంపిక విజ్ఞుడైన విశ్వకర్మకే ఎఱుక ! 70 ఏళ్ల నట జీవితంలో 255 చిత్రాలలో నటించిన అక్కినేనికి నివాళిగా అలరారవలసిన చిత్రాల ఎంపిక 'సినీ విజ్ఞాన విశారదు'లకే ఎఱుక ! ఆ ఎంపికను జానపద, పౌరాణిక, చారిత్రక, సాంఘిక చిత్ర వైవిధ్యాన్ని నిరూపించే సాధనంగా మాత్రమే కాకుండా శ్రీ ఎస్.వి.రామారావు నటుడిగా ఎయన్నార్ పరిణామక్రమాన్ని విశదీకరించడానికి కూడా వాడుకున్నారు. ఏ కళలోనైనా చేయి తిరిగాక ప్రదర్శించిన వైదుష్యాన్ని చర్చించడం ఒక ఎత్తు. కళాకారుడి చేయి తిరిగిన వైనం ఎటువంటిదో సోదాహరణంగా సాక్షాత్కరింప చేయడం మరో ఎత్తు. దానికై రచయిత ఎయన్నార్ నటజీవితంలోని మొదటి మూడు దశాబ్దాలపై ఫోకస్ పెట్టారు. తర్వాతి దశాబ్దాలలో వచ్చిన రొటిన్ సినిమాల జోలికి పోకుండా, ప్రత్యేకత చాటిన చిత్రాలనే ప్రస్తావించారు. శతజయంతి వేళ అక్కినేనిపై గౌరవాన్ని శతాధికం చేసేందుకు యీ పుస్తకం దోహద పడుతుందనడంలో సందేహం లేదు.

Browse more Telugu books