అంతర్జాతీయం /Antarjaateeyam

కె. బాలగోపాల్ K.Balagopal · Politics

అంతర్జాతీయం /Antarjaateeyam book cover

Price: Rs. 245. సోవియట్ సమాజం ఎంత అనాకర్షణీయమైన వ్యవస్థ అయినా అది ఉండబట్టే అంతర్జాతీయ రాజకీయాలలో అమెరికా సామ్రాజ్యదాహం కొంత మేరకు అదుపులో ఉండిందని ఇప్పుడు స్పష్టంగా అర్ధం అవుతున్నది. అమెరికా, రష్యా కూటముల మధ్య 50 ఏళ్ళపాటు ఉండిన సమతుల్యం అసమతుల్యమే అయినా, అణు యుద్ధం అంచున ఉన్న శాంతే అయినా, చిన్నాచితక దేశాలను పెద్దవారి ప్రయోజనాల కోసం కొట్లాడించిన ప్రచ్ఛన్న యుద్ధమే అయినా ఐక్యరాజ్యసమితి రూపంలో మానవ నాగరికత సాధించినట్లు కనిపించిన ప్రౌఢత్వానికి మూలం అదేనని ఇప్పుడు అర్థం అవుతున్నది. ఎప్పటికప్పుడు మనం 'అధికుల' మని పిలుచుకునే లక్షణాలను అధిగమించేస్తున్నా మని నమ్మాలన్న అహంభావపూరితమైన ఆరాటం చాలా విజ్ఞులుగా కనిపించే విశ్లేషకుల కళ్ళకు సహితం పొరలు కప్పకుండా ఉంటే ఈ సత్యాన్ని అంతకు ముందే గ్రహించి ఉందుమేమో. మానవులు ఏవో ప్రత్యేకమైన పరిస్థితులలో తప్ప 'అమానవీయం' అని పిలుచుకునే గుణాలను అధిగమించి బతకలేదనేది గత చరిత్రకు మాత్రమే సంబంధించిన వాస్తవం కాదనీ, వర్తమాన సత్యం కూడాననీ, బహుశ మనిషికి సంబంధించిన సార్వజనీన సత్యమనీ గ్రహించి ఉందుమేమో కూడ.

Browse more Telugu books